Wednesday, 4 November 2026

ఘనం గా రైతు దినోత్సవ వేడుకలు

 

ఏటూరునాగారం(జనం సాక్షి),జూన్03.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు క్లస్టర్ స్థాయి రైతు దినోత్సవ వేడుకలు శంక రాజు పల్లి రైతు వేదికలో జరిగింది.ఈ సందర్భంగా ఏటూరునాగారం రైతు వేదికకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐటీడీఏ పీవో అంకిత్ ఐఏఎస్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలైన రైతు బంధు రైతు బీమా వంటి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ అధికారి ప్రసూన రాణి, ఏడిఏ శ్రీధర్, ఏపీఓ వసంతరావు, జిల్లా కోఆప్షన్ వలియాబి, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, మరియు దొడ్డ కృష్ణ, ఎంపీటీసీ శ్రీలత, ఏవో వేణుగోపాల్, ఏఈఓ రాజు మరియు వివిధ గ్రామాలకు చెందిన రైతుబంధు సమితి అధ్యక్షులు మరియు నెంబర్స్ మరియు రైతులు పాల్గొన్నారు. శంకరాజు పల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ శకుంతల అధ్యక్షత వహించగా రొయ్యుర్ సర్పంచ్ జె సమత,ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో కుమార్,డి టి రాహుల్ చంద్రవర్మ, ఆత్మ బిటిఎం రామదాసు చౌహన్, ఏ ఈ ఓ ఈశ్వర్, రైతుబంధు సమితి సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.