హుజూర్ నగర్ జూన్ 3 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రైతు ముఖంలో చిరునవ్వు చిందించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని
లింగగిరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదిక నందు నిర్వహించిన రైతు ఉత్సవాలలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేడు వ్యవసాయం దండగ కాదు పండగ అనే నినాదంతో ముందుకు కదులుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అద్భుత పరివర్తనను సాధించిందనీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రైతు బిడ్డగా ఆలోచించి వ్యవసాయ రంగ పునర్జీవం కోసం సమగ్రమైన కార్యాచరణను అమలులోని తీసుకొచ్చి వ్యవసాయానికి ప్రాణాధారమైన కరెంటు, సాగునీటి మీద దృష్టి కేంద్రీకరించారు.
తెలంగాణ రాక ముందు తెలంగాణలో రైతు బిడ్డది తీరని దుఃఖం, సాగునీరు లేక విద్యుత్ శక్తి లేక ఎండిన బోర్లతో బిటలు వారిన పంట పొలాలతో పంటకు పెట్టుబడి లేక అప్పుల పాలై దళారుల చేతిలో చితికిపోయి దిక్కుతోచక రైతులు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. నేడుతెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే వినాదంతో ముందుకు కదిలి స్పష్టమైన ప్రణాళికలతో ఎన్నో రకాలుగా సహాయానికి కార్యక్రమాలను రూపొందించిదన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని తెలంగాణలో నిజం చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. రైతు బంధు ఎకరానికి సంవత్సరానికి రూ. 10,000 అందించడం, రైతు బంధు అకాల మరణం, రైతు కుటుంబానికి ఐదు లక్షల బీమా డబ్బులు అందించి ఆ కుటుంబాల ఆదుకుని నిలబెట్టడం, రైతు వేదికలు, కొనుగోలు కేంద్రాలు, కల్తీ విత్తనాలపై పిడి ఆక్టివ్ వేటు, ప్రతి ఐదు ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి, రైతులకు నిరంతరం సాగునీటి కోసం భారీ స్థాయి ప్రాజెక్టులు, మధ్యతరగ ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, లిఫ్ట్ ఇరిగేషన్లు కెనాల్సిన్ లైనింగ్ ద్వారా ఆధునికరించడం లాంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి అమలు చేసి వ్యవసాయాన్ని చక్కటి రైతు ముఖంలో చిరునవ్వు చిందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి ఎంతో భరోసా కల్పిస్తూ, నిరంతరం రైతు వెన్ను తట్టి ఉత్సాహాన్ని నింపుతూ రైతులకు మేము ఉన్నామని భరోసా ఇచ్చి రైతు ముఖంలో సంతోషాన్ని నింపుతున్న ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. పంటసాయం తో పాటు పంట కోనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గణ నీయంగా కృషి చేస్తూ ఉంది.
నేడు లింగగిరి సొసైటీ కోట్ల రూపాయల లాభంతో కొనసావుతుంది. లింగగిరి లో 49000 ఎకరాలలో వ్యవసాయం కొనసాగుతుంది. నేడు తెలంగాణ లో 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతుకు వ్యవసాయంలో సలహాలు సూచనలు సమస్యలకు పరిష్కారం ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు.
అనంతరం వ్యవసాయ విధానాలను ఆచరించి అధిక దిగుబడులను సాధించినటువంటి రైతులు కాసర్ల నాగమ్మ, కాసర్ల వెంకటేశ్వర్లు, మేడి మట్టయ్య, భీమ్ శెట్టి రామారావు లను శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి వారిని సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పంట కాలాన్ని ముందుకు నడిపే పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకారెడ్డి, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ కర్నాటి అంజిరెడ్డి, ముడెం గోపిరెడ్డి, పచ్చిపాల ఉపేందర్, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
రైతు ముఖంలో చిరునవ్వు.. – వ్యవసాయం దండగ కాదు పండుగ




