బెల్లంపల్లి, జూన్ 3, (జనంసాక్షి )
బీఆరెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం ఆయన బెల్లంపల్లి మండలం గురిజాల, కన్నాల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని, స్వతహాగా రైతు అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకాలంలో రైతుల కష్టాలను చూసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కోసం ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీలాంటి అనేక పథకాలను అమలుచేస్తున్నారని, ఈ పథకాల ద్వారా బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా వేల మంది రైతులు లబ్దిపొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర రైతు దినోత్సవాన్ని ఏర్పాటు చేసి రైతుల గౌరవం పెంచిన ఘనత కేవలం కెసిఆర్ కే దక్కుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమ పథకాల ఫలాలు రెట్టింపు కావాలంటే మనమందరం రైతు పక్షపాతి అయిన కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చి తద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ కెసిఆర్ నే ఎన్నుకోవాలని సూచించారు. ముందుగా రైతులతో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. రైతులకు పంటల వివరాల ముఖ్య సూచనలు తెలిపే కరపత్రాలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఉత్తమ రైతులను సన్మానించారు. రైతులతో సహాపంక్తి భోజనం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఆర్డివో శ్యామల దేవి, ఏడిఏ సురేఖ, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీఓ రాజేందర్, వైస్ ఎంపీపీ రాణి – సురేష్, ఎంపీటీసీలు పొట్లపల్లి సుభాష్ రావు, శకుంతల, సర్పంచులు జిల్లపల్లి స్వరూప, అశోక్ గౌడ్, కృష్ణమూర్తి, రాజమల్లు, ప్రమీల గౌడ్, మొగిలి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ గణేష్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెన్నెలలో రైతు దినోత్సవం.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నెన్నెల, చిత్తపూర్ రైతు వేదికల్లో రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నెన్నెలలో స్పెషల్ ఆఫీసర్ రాములు, చిత్తపూర్ లో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీపీ సంతోషం రమాదేవి పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతులతో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. రైతులకు పంటల వివరాల ముఖ్య సూచనలు తెలిపే కరపత్రాలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఉత్తమ రైతులను సన్మానించారు. రైతులతో సహాపంక్తి భోజనం చేశారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్, ఎస్సై శ్యామ్ పటేల్, వ్యవసాయ విస్తరణ అధికారులు రాంచందర్, సుప్రజ, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, వైస్ ఎంపీపీ గురునాదం సుమలత, ఎంపీటీసీలు పురంశెట్టి తిరుపతి, ఓరేం కమల, గొలుసుల శిరీష, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచులు తోట సుజాత శ్రీనివాస్, గొర్లపల్లి బాపు, బోయిని మల్లేష్, రావుల సత్యనారాయణ, ఇందూరి శశికళ రమేష్, బత్తిని పద్మ వెంకటేష్ గౌడ్, బోర్లకుంట శివ ప్రసాద్, చీర్ల సత్తమ్మ, కామెర సుధ శ్రీనివాస్, మేకల శారద, కున్సోత్ నీలా, ఎనుక మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండుతున్న జంకుతున్న రైతులు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రైతులను రైతు వేదికల వద్దకు తీసుకు రావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు నానా తిప్పలు పడ్డారు. ఎండలు తీవ్రంగా ఉండటం, భానుడి భగభగలకు ఉత్సవాలకు రావడానికి రైతులు ఉత్సాహం చూపించలేదు. మరో వైపు ఎండ 42 డిగ్రీలు ఉండటం, వేసవి తాపానికి రైతులు ఇబ్బందులు ఎదురుకున్నారు. వచ్చిన రైతులు సైతం ఎప్పుడు కార్యక్రమం ముగుస్తుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనే ఉన్నారు. ఎండలు ఇదే మాదిరిగా ఉంటే ఈఉత్సవాలు నామమాత్రంగా జరుగుతాయి తప్పించి ఉత్సాహంగా పాల్గొనే అవకాశాలు లేవు.




