Wednesday, 4 November 2026

ఘమెట్ పల్లి సాయిరాం నగర్ సంక్షేమ అభివృద్ధి సం ఎన్నికలు ఏకగ్రీవం

ఘమెట్ పల్లి సాయిరాం నగర్ సంక్షేమ అభివృద్ధి సం ఎన్నికలు ఏకగ్రీవం*

మెట్పల్లి టౌన్ నవంబర్ 22
జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలోని సాయిరాం నగర్ సంక్షేమ అభివృద్ధి సంఘ సభ్యులు సోమవారం రోజున సమావేశం ఏర్పాటుచేసి తధానంతరం ఎన్నికలను అదే రోజున సాయిబాబా మందిర ఆవరణలో ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షులుగా నాయిని శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఎలగందుల చొక్కయ్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పడకంటీ అనిల్ కుమార్, సహాయ కార్యదర్శిగా డాక్టర్ బుర్ర రవి గౌడ్, కోశాధికారిగా ర్యాగళ్ల కిషన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాయిరాం నగర్ అభివృద్ధి కోసం పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.