Wednesday, 4 November 2026

ధర్మపురి తహశీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన క్రిస్టియన్ అసోసియేషన్…

ధర్మపురి తహశీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన క్రిస్టియన్ అసోసియేషన్…

ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి మండలం క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సమూయేలు సోమవారం ఉదయం అసోసియేషన్ వారి సమీక్షి తో ధర్మపురి తహశీల్దార్ వెంకటేష్ ను మరియు మున్సిపల్ కమిషనర్ రమేష్ ను మర్యాదపూర్వకంగా కలసి వారికి పుష్ప గుచ్చం అందించిన తదనంతరం వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సైమాన్ ఉపాధ్యక్షుడు సామెల్ క్యాషియర్ ఏసన్న మరియు గౌరవాధ్యక్షుడు జాన్ వెస్లీ నతానియల్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు