హైదరాబాద్, అక్టోబర్7 ( జనం సాక్షి ) : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. అదేంటి రేవంత్‌ను ఎప్పుడు అరెస్ట్ చేశారని ఆలోచిస్తున్నారా..! కాదులేండి..!! టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పరామర్శించేందుకు రేవంత్ చంచల్ గూడ జైలుకెళ్లాడు. చంచల్‌గూడ జైల్‌లో ఉన్న రవి ప్రకాష్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. అరెస్ట్‌కు దారితీసిన పరిస్థితులపై రవిప్రకాశ్‌ను రేవంత్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కంపెనీ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి.సింగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గతంలో రేవంత్ రెడ్డి విూద మైహళమ్ రామేశ్వరరావు వర్గీయులు వ్యతిరేకంగా వార్తలు రాయమంటే రాయనన్నాననే తన విూద కక్ష కట్టినట్టు రవి ప్రకాష్ పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు అండగా ఉంటానని తెలియచెప్పెందుకే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లినట్టు చెబుతున్నారు.
చంచల్‌గూడ జైలుకు రేవంత్ రెడ్డి!




