చండ్రుగొండలో యోగా దినోత్సవ వేడుకలు
చండ్రుగొండ జనంసాక్షి జూన్ 21:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 300మంది విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అబ్బురపరిచే యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉండేటీ.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ యోగా ధ్యానం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత తో పాటు శారీరక పటిష్టతను పెంచుతుందన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే యోగా పట్ల శ్రద్ధ పెంచేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుశ్రీ కృష్ణా ఎండీ హాషమ్ ఆదిలక్ష్మి రాజశ్రీ వెంకటేశ్వరరావు రాములు లక్ష్మణ్ శకుంతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.