జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ధాన్య కొనుగోలు కేంద్రం వద్ద గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు శుక్రవారం పరిశీలించి సంబంధిత అధికారులకు విషయాన్ని తెలిపి సత్పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఆయన వెంట చందనపూర్ సర్పంచ్ దాసరి శంకర్, మాజీ ఎంపిటిసి ఏలువాక ఓదెలు, టిఆర్ఎస్ నాయకులు కొండ శీను, ఏలువాక సతీష్, రైతులు తదితరులు ఉన్నారు.




