Thursday, 5 November 2026

నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయండి : యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గౌని రాజా రమేష్ యాదవ్

 

 

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గౌని రాజా రమేష్ కోరారు. శుక్రవారంమిర్యాలగూడ స్థానిక గాంధీ భవన్ లో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్ నిర్వహించిన యూత్ జోడోబూత్ జోడో సమావేశానికి హాజరైన గౌని రాజా రమేష్ మాట్లాడుతూ మన దేశంలో ఎక్కువ మంది యువకులు నిరుద్యోగ సమస్యతొ పోరాడుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.అందుకే ప్రతి బూత్ స్థాయిలో యువజన కాంగ్రెస్ నాయకులు ఉండేలా ఈ బూత్ జోడో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు సైనికుని వలె పోరాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులను సాధించుకోవాలి తప్ప ఆత్మ హత్యలు చేసుకోకూడదని ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నాయకులకు సూచించారు. హైదరాబాద్ లో ఈనెల 8 న హైదరాబాద్ లో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీకి ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ రానున్నారని, యువకులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ ని జయప్రదం చేయాలని ఆయన యువతకి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ ఇమ్రాన్, సిద్దు నాయక్, ప్రధాన కార్యదర్శి మాతంగి సంజీవ్, యువజన కాంగ్రెస్ నాయకులు, పర్వజ్,సురేష్, సతీష్, బబులు,సోను,కిరణ్, చంటి, విజయ్, అజయ్,సిపాయి బాబా, అశోక్,గిరి, క్రాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.