Monday, 2 November 2026

చంద్రబాబు టీడీపీని సర్వనాశనం చేశాడు

– ఎన్టీఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కాడు
– దళితుల ఓట్ల కోసమే దళితతేజం
– జులై 11న తిరుమల వెళ్లి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటా
– ముందస్తు ఎన్నికలొస్తే ఆలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తా
– విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : సమసమాజం కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు విూడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ముద్దు కృష్ణమనాయుడిని తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు వాడుకున్నారని, కానీ సీఎం అయ్యాక గాలికొదిలేశారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని, దళితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. నెల్లూరు దళిత తేజం సభలో దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జులై 11వ తేదీన నా జన్మదినమని, ఆ రోజున తిరుపతి వెళ్తానని, చంద్రబాబు ఓడిపోవాలని వెంకన్నకు మొక్కుతానన్నారు. సీఎం రమేష్‌లా దీక్ష చేస్తే ఏడాదిపాటు చేయొచ్చని ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్‌ చేస్తున్న దీక్షపై మోత్కుపల్లి విమర్శలు చేశారు. 11 రోజులైనా అలసిపోకుండా సీఎం రమేష్‌ దీక్ష చేస్తున్నాడు. దొంగ దీక్ష చేస్తున్నాడు కాబట్టే.. టీడీపీ ఎంపీలు చులకనగా మాట్లాడారు. చంద్రబాబు ఏనాడు ఏపీకి ప్రత్యేక ¬దా కావాలని కేంద్రాన్ని అడగలేదని, ¬దా కావాలని అడిగే నైతికహక్కు చంద్రబాబు కోల్పోయారన్నారు. ¬దా కోసం పోరాడుతుంది వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వామపక్షాలన్నారు.  టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్ను అని, చంద్రబాబు హృదయం లేదని బండరాయని విమర్శించారు. నేను ఏడిస్తే ఒక్కసారైనా వచ్చి ఓదార్చారా అంటూ ప్రశ్నించారు. చివరకు నన్ను విజయసాయిరెడ్డి సహా అన్ని పార్టీల వాళ్లు ఓదార్చారన్నారు. చంద్రబాబుకు ధైర్యముంటే కేసులన్నింటినీ రీ ఓపెన్‌ చేసుకోవాలని, చంద్రబాబు దొరకని దొంగ అంటూ తీవ్రస్థాయిలో ఏపీ సీఎంపై మోత్కుపల్లి ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబును వదిలిపెట్టేది లేదన్నారు. నువ్వు, ఈన కొడుకూ తప్ప రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నరా అని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేశారని, ఇప్పుడు ఏపీ ప్రజలు తన్ని తరియేయడానికి సిద్ధంగా ఉన్నారని మోత్కుపల్లి అన్నారు. దళితులను దుర్భాషలాడిన ఆదినారాయణరెడ్డిని తక్షణమే కేబినెట్‌ నుంచి తొలగించాలని’ మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు. ముందస్తు ఎన్నికలొస్తే ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.