Monday, 2 November 2026

చంద్రబాబు డర్టీయెస్ట్‌ పాలిటీషిన్‌

పచ్చి అబద్దాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు
హైకోర్టు విభజనపైనా అబద్దాలేనా?
స్వయం ప్రకాశం లేని నేత చంద్రబాబు
ఐటీలోనూ ఆయన పీకిందేవిూ లేదు
మండిపడ్డ సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఈ దేశంలో చంద్రబాబు అంత డర్టీయెస్ట్‌ పొటిటీషియన్‌ మరొకరు లేరని ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై కేసీఆర్‌ మండిపడ్డారు. పచ్చి అబద్దాలు ఆడడంలో ఆయన దిట్టని అన్నారు. ఆయనకు మాట విూద నిలబడే తత్వం ఉందా అని ప్రశ్నించారు. డిసెంబరు నాటికి హైకోర్టు భవనాలు సిద్ధం చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ హైకోర్టును అక్కడికి మార్చుకోవాల్సింది పోయి అనవసర విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా హైకోర్టుకు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఎవరి తప్పు? రాష్ట్ర ప్రభుత్వమే అఫిడవిట్‌ దాఖలు చేసింది గనక సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేంద్రం నోటిఫై చేసిందని తెలిపారు. ఏర్పాట్లు చేయకుండా హైకోర్టు విభజన హడావిడిగా చేశారని చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఉందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. గతంలోనే తాము ఇక్కడే కోర్టు ఏర్పాఉట చ ఏసుకోవచ్చని చెప్పామని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతోందని… ఏ సీఎం అయినా, ఏ నాయకుడైనా వారి ప్రజలకు ఇబ్బంది కలగకుండా హైకోర్టును అక్కడకు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. ఏది పడితే అది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటారని… ఆయనకు డబ్బా కొట్టేందుకు రెండు పేపర్లు ఉన్నాయని విమర్శించారు. అర్థం పర్థం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్‌ నాటికి హైకోర్టును ఏపీకి తీసుకెళతామని ఏపీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని… హైకోర్టును ఏపీకి తీసుకెళ్లాల్సిన అవసరంలేదని… ఇక్కడే రెండు హైకోర్టులను వేర్వేరుగా నిర్వహించవచ్చని తాము కూడా అఫిడవిట్‌ వేశామని చెప్పారు. కోర్టును సపరేట్‌ చేస్తే చాలని తాము చెప్పామని అన్నారు. రెండు అఫిడవిట్లను చూసిన సుప్రీంకోర్టు… ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ ను పరిగణనలోకి తీసుకుని… జనవరి 1 నుంచి రెండు హైకోర్టులు విధులను ప్రారంభించాలని ఆదేశించిందని తెలిపారు.  డిసెంబర్‌ లోనే హైకోర్టును సిద్ధం చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం… ఇంకా ఎందుకు కోర్టును సిద్ధం చేయలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. అలాంటప్పుడు అఫిడవిట్‌ ఎందుకు వేశారని అడిగారు. హైకోర్టును విభజించింది సుప్రీంకోర్టు అని… సుప్రీం తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై  మాత్రమే చేసిందని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారని…అంతా ఆయన ఇష్టమేనా అని దుయ్యబట్టారు. చంద్రబాబు అంత డర్టీయెస్ట్‌ పొలిటీషియన్‌ ఈ దేశంలో ఎవరూ లేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ నాయకుడిని కలిస్తే చంద్రబాబుకు ఏం సమస్య అని కేసీఆర్‌ ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు మోడీకి డబ్బా కొట్టి… ఇప్పుడు రాహుల్‌ గాంధీ పక్కన చేరారని చెప్పారు. చంద్రబాబులాంటి ముఖ్యమంత్రిని చూసి, ఏపీ ప్రజలు సిగ్గుపడాలని అన్నారు. ఏ మొహం పెట్టుకుని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు
ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని చెప్పారు. చంద్రబాబు ఏం చేయలేక ఇతరులపై ఏడుస్తున్నారని, ఆయన పాలనలో విపరీతమైన అవినీతి పెరిగిందని కేసీఆర్‌ ఆరోపించారు. చంద్రబాబు పచ్చి రాజకీయ స్వార్థపరుడు, దద్దమ్మ అని ఆయన అన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశమున్న నేత కాదని, మామ పెట్టిన పార్టీని చంద్రబాబు లాక్కున్నారని కేసీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఆయనలా కాదని, కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చానని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించే అర్థిక నమూనాపై చంద్రబాబుకు అవగాహన లేదని కేసీఆర్‌ విమర్శించారు. రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం అనుసరిస్తుందని ఆయన అన్నారు. తమ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని, కల్యాణలక్ష్మి, పారిశ్రామికరాయితీలను కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. ఐటీలోనూ చంద్రబాబు పీకిందేవిూలేదని అన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారనడం అంతా కల్పనేనని కేసీఆర్‌ విమర్శించారు.