విద్యావైద్య రంగాలకు ప్రాధాన్యం
ప్రగతి భవన్‌లో అధికారులతో సిఎం కెసిఆర్ సవిూక్ష
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి) : నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో చెవి, ముక్కు, గొంతు, దంత వైద్య శిబిరాలకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రతి పౌరుడి హెల్త్ ప్గ్రొ/ల్ ను రూపొందించాలని ఆదేశించారు. నీటి పారుదల, వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలన్నారు. డిండి, ఎస్సారెస్పీ పునరుజ్జీవం వంటి ఎత్తిపోతల పథకాలన్నీ ఈ దఫాలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ప్రాజెక్టుల పనుల పురోగతిపై నివేదికలు తయారు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బడ్జెట్ రూపకల్పనకు ఇప్పట్నుంచే కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈసారి ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుందని.. ఈ సందర్భంలో రాష్ట్ర బడ్జెట్ పూర్థి స్థాయి ఉండాలా? మధ్యంతర బడ్జెట్ పెట్టుకోవాలా? అనే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలన్నారు. ఫించనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని సీఎం సూచన చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నీటిపారుదల రంగానికి పెద్దపీట




