చట్టాలపై అవగాహనతోనే మెరుగైన సమాజం
పానుగల్ నవంబర్07,జనంసాక్షి
చట్టాలపై అవగాహనతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని పారా లీగల్ వాలంటీర్ కురుమన్న అన్నారు. సోమవారం పానుగల్,వనపర్తి రూరల్ కు సంబంధించిన గ్రామాల్లో పర్యటించి న్యాయవ్యవస్థ పై అవగాహన సదస్సు నిర్వహించారు. చింతకుంట, మాందాపూర్ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు అదేవిధంగా ఈ న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమాలు వారం రోజులపాటు మండలంలోని పాఠశాలలో కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహనతోనే మెరుగైన సమాజం




