చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి బోథ్ (జనంసాక్షి) బాల్యం నుండే చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి బి హుస్సేన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండే చట్టాల గురించి అవగాహనా కలిగి ఉండాలని విద్యాహక్కు, బాల్యవివాహాలు, ర్యాగింగ్, మోటారు వెహికిల్ ట్రాఫిక్, సైబర్ నేరాలు గురించి అవగాహన కలిగి ఉంటూ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ పాఠశాలకు దిటుగా చదువులో ముందుండాలని తెలిపారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో మొక్కను నాటి హాస్టల్ ను తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ కిరణ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు గోడం చందన్ సర్పంచ్ పంద్రం సుగుణ బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్ న్యాయ వాదులు ఆడెపు హరీష్ కుమ్మరి విజయ్ కుమార్ పోలీసు కోర్టు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి




