Thursday, 5 November 2026

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

 

ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవిత

మల్దకల్ జనవరి 21 (జనంసాక్షి)మల్దకల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారము జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు.పలుచట్టాల గురించి వివరించారు.అంతకుముందు శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.దేవాలయ చరిత్రను చైర్మన్ ప్రహ్లాద రావు వివరించారు.ఈ కార్యక్రమంలో గద్వాల బార్ అసోసియేషన్ సెక్రటరీ మధుసూదన్ బాబు,అడ్వకేట్ రవిశంకర్, సర్పంచ్ యాకోబు, ఎస్ ఐ ఆర్ శేఖర్, పంచాయతీ సెక్రెటరీ మాబి, ఉప సర్పంచ్ సీకిన మల్దకల్, కోర్టు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.