Thursday, 5 November 2026

శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

 

ఝరాసంగంజనవరి 21(జనం సాక్షి)
పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్య సందర్భంగా శనివారం ఝరాసంగం మండలం లోని సప్తగిరి శనీశ్వర ఆలయం ఏడకుల పల్లి ,దత్తగిరి ఆశ్రమం లో భక్తులు భారీగా చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. మండల వ్యాప్తంగా ఆ ఆ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు ఉదయం నుండి ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శనీశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దత్తగిరి మహరాజ్, ఏడకుల పల్లి లో సర్పంచ్ శ్రీనివాస్, నిర్వాహకులు, రఘునందన్ రెడ్డి, బాస్కర్ రెడ్డి, శ్రీ హరిరెడ్డి, శుక్లావర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.