Friday, 6 November 2026

చదవుతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యం-న్యాయవాది పంద్రం శంకర్

చదవుతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యం-న్యాయవాది పంద్రం శంకర్.
నెరడిగొండ డిసెంబర్24(జనంసాక్షి): నేటి పోటీ ప్రపంచంలో చదువనే ఆయుధంతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమని న్యాయవాది పంద్రం శంకర్ పేర్కొన్నారు.శనివారం రోజున మండలంలోని లక్కంపూర్ గ్రామ సర్పంచ్ కుంరం జంగు అధ్యక్షతన గ్రామస్తులకు చట్టాల గురించి అవగాహనా కల్పిస్తూ భవిష్యత్తులో ఆదివాసీలు విద్యతో పాటు మనిషికి అవసరమైన చట్టాలు మోటరు వెహికిల్ విద్యాహక్కు బాలకార్మిక నిర్ములన పీసా ఏజెన్సీ చట్టాల గురించి గ్రామస్తులకు అవగాహనా కల్పించారు.ఈ సందర్బంగా న్యాయవాదికి గ్రామస్తులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్మేడి ఆత్రం సోనేరావు సెక్రటరీ రవికిరణ్ గ్రామ పటేల్ ఆత్రం సుంగు బోథ్ తుడుం దెబ్బ కార్యదర్శి దుర్వ విశ్వేశ్వర్ రావ్ దేవరి మాడవి దేవురావు కారోబారి ఆత్రం లక్ష్మన్ గంగారాం గ్రామస్తులు పాల్గొన్నారు