మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించాలి.
-కొల్లాపూర్ తాలూకా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు.
-ఎన్నికలు నిర్వహించాలని ఎండి కి వినతి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్24(జనంసాక్షి):
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించాలని జిల్లాలోని వివిధ మండలాల మరియు తాలూకాల మత్స్య సహకార సంఘాల నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని మత్స్య శాఖ కార్యాల యంలో జిల్లా అధికారి లక్ష్మప్ప ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కొల్లాపూర్ తాలూకా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలైనా రాష్ట్రంలోని 33జిల్లాల మత్స్య శాఖలకు ఎలక్షన్ నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 5వేల సొసైటీలలోని లక్షల మంది మత్స్యకారులకు నష్టం జరుగుతుందని తెలిపారు.గతంలో 33 జిల్లాలకు ఎలక్షన్ జరపాలని హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల 33 జిల్లాలుగా బైబర్ కేషన్ జరిగిందని,ఇది జరిగి కూడా రెండు సంవత్సరాలు అవుతున్నా మత్స్య శాఖ కమిషనర్,ఎలక్షన్ అథారిటీ వాళ్లు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని మండిపడ్డారు.ఇది తగదని, తక్షణమే రాష్ట్రంలో 33 జిల్లాలకు ఎలక్షన్ నిర్వహించి ప్రతి సొసైటీ కి ప్రతి సభ్యునికి ప్రతి ఇంటి గడపకి తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి, నల్గొండ,కరీంనగర్,ఖమ్మం నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మత్స్యశాఖ ఏడి కార్యాలయాలలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో
కొల్లాపూర్ తాలూకా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు , పెద్దకొత్తపల్లి మండలం అధ్యక్షులు చెంది వెంకటస్వామి, పానగల్ మండలం సంగనమోని రంగస్వామి, మాధవరావుపల్లి సొసైటీ అధ్యక్షులు చంద్రశేఖర్, తాలూకా కోఆర్డినేటర్ ఎల్ఐసి నరసింహా, ఎర్రమోని శివయ్య, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు హరికృష్ణ, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట బాలరాజు, కొత్తకోట సొసైటీ అధ్యక్షులు సంద రంగస్వామి, గన్యాగుల సొసైటీ అధ్యక్షులు మహేష్ , వీరం రాజు పల్లి సొసైటీ అధ్యక్షులు శ్రీశైలం, బిజినపల్లి సొసైటీ అధ్యక్షులు అల్లు అర్జున్, తిమ్మాజిపేట సొసైటీ అధ్యక్షులు గంజి ఆంజనేయులు, నాగర్ కర్నూల్ సొసైటీ అధ్యక్షులు వెంకటయ్య, మండల నాయకులు బంగారయ్య ,నాగనూల్ సొసైటీ అధ్యక్షులురాములు,పుల్జాల సొసైటీ అధ్యక్షులు రమేష్,




