:శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరి గుట్ట షామీర్పేట కళాశాలలో పాశుద్ధ్య టెండర్ పై దరఖాస్తులు స్వీకరించ టం జరుగుతుందని శామీర్పేట కళాశాల టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి జగద్గిరి గుట్ట ప్రిన్సిపాల్ డాక్టర్ ఇష్రత్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. షామీర్పేట మండల పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్టలో పారిశుద్ధ్య టెండర్ కొరకై దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 20 వ తేదీ వరకు సమయం ఉందని ఆసక్తి ఉన్న పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థినులు వారి తల్లిదండ్రులు దరఖాస్తు కొరకు 500 రూపాయలు డిడి రూపంలో షామీర్పేట నందు గల కళాశాలలో సమర్పించగలరని ఆమె తెలిపారు దరఖాస్తు ఫారం స్వీకరణ సమయం ఉదయం పదిగంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని ఈనెల 20 వరకు టెండర్ ప్రకటించుకోవాలని కోరారు మరిన్ని వివరాలకు చరవాణి 9121004530 నంబర్ కు సంప్రదించగలరని ఆమె పేర్కొన్నారు.
పారిశుద్ధ్య టెండర్ కి దరఖాస్తుల ఆహ్వానం :ప్రిన్సిపాల్ డాక్టర్ ఇశ్రాత్




