సూర్యాపేట కాల్పుల్లో గాయపడ్డ సీఐ, కానిస్టేబుల్ ను హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. హోంమంత్రి నాయిని, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వారిని పరామర్శించారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి 25 లక్షలు, హోంగార్డు కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడ్డ సీఐ, హోంగార్డుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హోంమంత్రి వెల్లడించారు. అటు డీజీపీ అనురాగ్ శర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
గాయపడ్డ పోలీసులకు మంత్రుల పరామర్శ
దోపిడి దొంగల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ మొగులయ్య, కానిస్టేబుల్ ను హోంమంత్రి నాయిని, విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి పరామర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగితెలుసుకున్నారు. గాయపడ్డ సీఐ, కానిస్టేబుల్ పరిస్థితి గురించి వైద్యులు వెల్లడించారు.




