బచ్చన్నపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి) ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు ఉంటుందని .అంబేద్కర్ యువజన సంఘం బచ్చన్నపేట మండల అధ్యక్షులు మల్యాల బాల నరసయ్య అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ప్రపంచ మేధావి. భారత రాజ్యాంగ నిర్మాత. భారతరత్న. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతి గొప్ప విద్యావంతుడిగా గుర్తిస్తూ. అంబెడ్కర్ ఆశయాల కోసం అందరం పనిచేయాలని. ఈనెల 14న హైదరాబాద్ నగరం నడిబొడున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించి. నేడు చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి. 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి. చరిత్రలో నిలిచిపోయేలా. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అంబేద్కర్ యువజన సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని . అదేవిధంగా దేశ రాజధాని లో ఉన్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు




