ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్29. ఈ రోజు ఏటూరునాగారం నాగారం యం.పి.డి.ఓ ఆఫీస్ ఆవరణలో జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ నిరవిధిక దీక్షలో బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ, బిఎస్పి ములుగు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఏంపెల్లి వీరాస్వామి, బీఎస్పీ ఏటూరునాగారం మండల అధ్యక్షులు ఏంపెల్లి రాజు పాల్గొని వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ సమ్మెను ఉద్దెశించి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అసెంబ్లీ అధ్యక్షులు ఏంపెల్లి వీరాస్వామి మాట్లాడుతూ,కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉండదని మాయమాటలు చెప్పిన కేసీర్, నోటిఫికేషన్ ధ్వారా ఉద్యోగాలు సాధించి,ప్రోహిబిషన్ కూడా పూర్తి చేసుకున్న అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులరైజే షన్ చేయక పోవడం దారుణమని,ఈ విషయాన్నీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. అర్ ఎస్. ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళారు.అయినా ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వం స్పందించక పోవడా న్ని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ములుగు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.వెంటనే జూనియర్,అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి,నాలుగు సంవత్సరాల ప్రొహేబిషన్ కాలాన్ని సర్వీస్ లో కలపాలి,లేని యెడల అర్ ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో సమస్య పరిష్కారం అయ్యేవరకు పంచాయితీ కార్యదర్శుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




