Monday, 2 November 2026

దళిత రత్న అవార్డు అందుకున్న  రాణంపల్లి మహిళా

 

 

 

 

 

రుద్రూర్: (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో స్వచ్ఛందంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తించి దళిత రత్న బిరుదులను ప్రకటించింది.ఈ అవార్డుకురుద్రుర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన దళిత నాయకురాలు నీరడి సవిత  గత కొంతకాలంగా దళిత సమస్యలపై స్పందిస్తున్నారు. అందుకు గాను ఆమెకు ‘దళితరత్న” అవార్డును  నిజామాబాదు నగర ప్రథమ పౌరురాలు దండు నీతూకిరణ్ శేఖర్  శనివారం అవార్డును ఇచ్చి. శాలువా పూలమాలతో సత్కరించారు.  నీరడి సవిత సేవలను గుర్తించిన  కమిటీ చైర్మనులు మేడి పాపయ్య, జంగా శ్రీనివాసులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక మహిళ దళితరత్న అవార్డుకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నీరడి సవిత మాట్లాడుతూ.. తనకు దళిత రత్న అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.దళిత సమస్యల పట్ల స్పందిస్తానని,మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. తన ఎంపికకు కృషి చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య,జిల్లా అధ్యక్షుడు చిట్టెపు మోహన్ రావులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.