– బారులు తీరిన భక్తులు.భైంసా రూరల్ జనవరి 29 జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్లాష్టమి మాఘమాసం పురస్కరించుకొని పోచమ్మ,మహాలక్ష్మి, పలు అమ్మవారి ఆలయాలలో ఆదివారం చలి బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా భక్తులు ఉదయం నాలుగు గంటల నుండి బారులు తీరారు. క్యూ లైన్ లలో నిలబడిన భక్తులకు బోనాల సమర్పణ కు దాదాపు 3 గంటల సమయం పట్టింది.కుటుంబ జీవితాలు చల్లగా చూడాలని,అమ్మవారిని మొక్కుతూనైవేద్యాలు సమర్పించిమొక్కులు తీర్చుకున్నారు.




