భైంసా రూరల్ జనవరి 29జనం సాక్షితానూర్ మండలం లోని తొండల గ్రామంలో ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నేరాల నియంత్రణకు కర్డెన్ సార్చ్ ముదోల్ సిఐ వినోద్ అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సరైన పత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలు మరియు 8 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముధోల్ సీఐ వినోద్, తానూర్ ఎస్ఐ విక్రమ్ , లోకేశ్వరం ఎస్ఐ సాయికుమార్, ముధోల్ ఎస్ఐ తిరుపతి,బాసర ఎస్ఐ మహేష్ ,RSI మరియు ముధోల్ సర్కిల్ సిబ్బంది మరియు మొత్తం 70 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ సీఐ వినోద్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని మరియు సైబర్ క్రైమ్ గురించి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది.




