చలివేంద్రం ను ప్రారంభించిన ఖిజర్ యపై
ఝరాసంగం ఏప్రిల్ (జనం సాక్షి )మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను బి ఆర్ ఎస్ నాయకులు ఖిజర్ యపై ప్రారంభించారు. అనంతరం ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన ముస్లిం సోదరులతో కలిసి అల్పాహారాన్ని సేకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ముస్లిం సోదరులకు ఇది పవిత్ర దినమని రాబోయే రంజాన్ పండగ ముస్లిం సోదరులందరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు ఎల్లపుడు హల్లా దయతో వారి కుటుంబాల్లో వెలుగులు నిండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఖీజర్ యపై అభిమాన సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చలివేంద్రం ను ప్రారంభించిన ఖిజర్ యపై




