Tuesday, 3 November 2026

చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా శ్రీనివాసరావు

జూలూరుపాడు, ఏప్రిల్ 3, జనంసాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షునిగా కోదాడ శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనతోపాటు సంఘం కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తిరునగిరి వెంకటేశ్వర్లు సమక్షంలో ఆదివారం బిఎంఎస్ భవనంలో నియోజకవర్గ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. అధ్యక్షునిగా కోదాడ శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా తిరునగిరి యాదగిరి, పద్మ, కార్యదర్శిగా తిరునగిరి వెంకటేశ్వర స్వామి, సహాయ కార్యదర్శులుగా నేరేడుమల్లి పవన్, అరుంధతి, ఆర్థిక కార్యదర్శిగా అనంతయ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో సంఘం జిల్లా కార్యదర్శి రామస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి జిల్లా నాయకుల సహాయ సహకారాలతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని శ్రీ వైష్ణవ నిరుపేద కుటుంబాల వారిని ఆదుకునేందుకు కూడా తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.