మృతుని కుటుంబానికి బియ్యం అందజేస్తున్న శ్రీ చైతన్య యూత్ సభ్యులుజనం సాక్షి,( భువనగిరి ఆర్.సీ)న్యూస్ ;మృతుని కుటుంబానికి బియ్యం పంపిణీ
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన గోపె చంద్రయ్య (72) కుటుంబ సభ్యులకు శ్రీ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో 50 కేజీల సన్నబియ్యాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి యువజన సంఘం ఆధ్వర్యంలో చేయూతనందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య యువజన సంఘం నాయకులు గోపె మల్లేష్, నరసింహ, రవి, మహంకాళి, సంజీవ, రమేష్, మహేష్, మధు, శ్రీను, మహేష్, కుమార్, శ్రీధర్, రాజు, క్రాంతి, నరసింహ, సురేష్, క్రాంతి, దుర్గ ప్రసాద్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి బియ్యం అందజేస్తున్న శ్రీ చైతన్య యూత్ సభ్యులు




