Wednesday, 4 November 2026

చలో అచ్చంపేట కు పిలుపునిచ్చిన నిఖిత న్యాయ జేఏసీ కమిటీ..బిజెపి నేతఈటెల రాజేందర్ రాక 

 

 

 

 

 

అచ్చంపేట ఆర్సీ,10 ఏప్రిల్ 2023 ,జనంసాక్షి న్యూస్ :  నియోజకవర్గంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన నగిళ్ళ నిఖిత  మన్ననూర్ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి బాలిక  గత నెలలో మెడకు ఉరి వేలాడుతూ చనిపోయిన ఘటనలో మృతికి కారణం ఎవరో ఎలా జరిగిందో అనే సందేహలపై తల్లిదండ్రులు ప్రజా సంఘాలు,కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ,బీఎస్పీ,ఎస్సి,ఎస్టీ,బిసి కులాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, పట్టణ బంద్ లు చేసి నిఖిత మృతికి గల కారణాలను బయట పెట్టి దోషులను చట్ట ప్రకారం శిక్షించాలని మందకృష్ణ మాదిగ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడువంశీకృష్ణ,టిడిపి నాయకులు మోపతయ్య,బిఎస్పీ  కొయ్యల శ్రీనివాసులు,బిసిఎస్సి నాయకులుకాశన్న యాదవ్,శంకర్ నాయక్,పత్కుల శ్రీశైలం,తదితరులు పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నికిత మృతదేహానికి రి పోస్టుమార్టం నిర్వహించిన కూడా నిఖిత ప్రాణాలు కోల్పోయి దాదాపు నెల రోజులు కావొస్తున్న నేటికి పూర్తిస్థాయి విచారణ గాని నిందితుల ఆచూకీ బయటపడకపోవడం శోచనీయంఅని దీంతో నిఖిత న్యాయ జేఏసి కమిటీ ఆధ్వర్యంలో మరో మారు చలో అచ్చంపేటకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ టిడిపి బీఎస్పీ తదితర కుల సంఘాలు ప్రజాసంఘాలతోపాటుగా బిజెపి పార్టీ నుంచి ఈటెల రాజేందర్ ఈ నెల 16న తలపెట్టబోయే చలో అచ్చంపేట కార్యక్రమానికి హాజరవ్వనున్నారని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి సతీష్ మాదిగ తెలిపారు.