Wednesday, 4 November 2026

జర్నలిస్టులపై దుర్భాషలాడిన ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీస్ లోని వ్యక్తిపై  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

 

 

 

అచ్చంపేట  ఆర్సి,10ఏప్రిల్2023,జనం     సాక్షి :     న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దుర్భాషలాడిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోని వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసిన జర్నలిస్టులు. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై క్యాంప్ ఆఫీసులో ఉన్న వ్యక్తి పాత్రికేయులను దూషించాడని పట్టణానికి చెందిన పలువురు పాత్రికేయులు అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లు ధరించి మానవహరంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం  స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై జనం సాక్షి న్యూస్ స్థానిక సీఐ అనుదీప్ ను చరవాణి ద్వారా అడగగా నిజమేనని పూర్తి వివరాలు ఎస్సై ద్వారా పిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని తదుపరి చర్యలు చట్టప్రకారంగా చేపడుతామని తెలిపారు