చలో కరీంనగర్ విజయవంతం చేయాలి ఈనెల 5న
రాష్ట్ర కాంగ్రెస్ పిలుపుమేరకు
వీణవంక డిసెంబర్ 3 (జనం సాక్షి) వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ
కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడు
రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు
ఈనెల 5న జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు రైతు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రధాన అంశాల ఆధారంగా ధర్నా. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే మా ప్రయత్నం.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ, ఈ ధర్నా లో వీణవంక మండలంలోని యువత, రైతులు, ప్రజలు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతున్నాము రైతులు పంట పండించిన తర్వాత మిల్లర్లు
తరుగు పేరుతో ధాన్యంలో కోత వల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారు
ధరణి పోర్టల్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు అని రైతు డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రైతు రుణ మాఫీ పై స్పష్టమైన ప్రకటన
చేయాలి ఇటీవల జరిగిన .. పోడు భూముల పంపిణీ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి
రైతులకు చెందిన అనేక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అండగా
ఉంటుంది రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, నాయకులు గంగాడి రాజి రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, సుకసి యాదగిరి, అడిగొప్పుల వెంకన్న,అలిగివెల్లి మోహన్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.




