Tuesday, 3 November 2026

రాష్ట్రపతి భవన్ లో జరిగిన నృత్య ప్రదర్శనలో పాల్గొన్నా విద్యార్ధిని ని సన్మానించిన

–

 

 

 

 

 

బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు రాజు. మండల అధ్యక్షులు శ్రీనివాస్.మర్పల్లి జనవరి 29 (జనం సాక్షి) దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రానికి చెందిన పైలు మీనాక్షి 9వ తరగతి (సంగం లక్ష్మీబాయి బాలిక గురుకుల పాఠశాల) ఎంపిక అయ్యారు. బహుజన్ సమాజ్ పార్టీ కి చెందిన ముఖ్య నేతలు వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు తలారి రాజు. మర్పల్లి మండల అధ్యక్షులు పర్వేద శ్రీనివాస్ లు సన్మానించారు. ఈ సందర్భంగా బీఎస్పీ వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని లో జరిగిన గణతంత్ర వేడుకల్లో వికారాబాద్ జిల్లా విద్యార్థిని ఎంపిక అవ్వడం జిల్లాకే గర్వకారణం అని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తంచేశారు. మండల అధ్యక్షులు పర్వేద శ్రీనివాస్ గారు అభినందనలు తెలిపారు.ఇట్టి సన్మాన కార్యక్రమానికి ఉప అధ్యక్షులు హర్షవర్ధన్, మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్, మండల కార్యదర్శి కావాలి ప్రభాకర్, మర్పల్లి మాజీ సర్పంచ్ మనోహర్, నర్సింలు, తదితర నాయకులు పాల్గొన్నారు.