Tuesday, 3 November 2026

చలో హైదరాబాద్ తెలంగాణ భరోసా సభ పోస్టర్లను ఆవిష్కరించిన లింబాద్రి

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 29,జనంసాక్షి :బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,న్యాయవాది పుప్పాల లింబాద్రి చలో హైదరాబాద్ తెలంగాణ భరోసా పోస్టర్లను మెట్పల్లి పట్టణంలో శనివారం రోజున ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే ఏడవ తేదీన హైదరాబాదులోని సరూర్నగర్ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సభకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు కావున జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ధర్మపురి జగిత్యాల నియోజకవర్గం నుండి కార్యకర్తలు నాయకులు అభిమానులు యువకులు మేధావులు మహిళలు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీ వర్గాల తో పాటు అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మద్దెల నారాయణ, జిల్లా నాయకులు బొల్లంపల్లి సంపత్, కుమార్ దేవ్ సింగ్ రాథోడ్, బత్తుల లక్ష్మణ్, ధర్మపురి మరియు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి లు నక్క విజయ్ చంద్రశేఖర్, నాయకులు గంగాధర్, తిరుపతి, విజయ్, సలీం, శంకర్, తదితరులు పాల్గొన్నారు.