ఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 29 :రైతులు కష్టపడి పండించిన వరి, మిరప, ఆముదాలు తదితర పంటలను వర్షానికి తడిచి పోకుండా భద్రపరుచుకోవాలని ఏఈఓ మౌనిక రైతులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామాన్ని ఆమె సందర్శించి రైతులకు వర్ష ప్రభావం నుండి పంటలను కాపాడుకునేందుకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్ కవర్లతో భద్రపరచుకోవాలన్నారు. వర్షాలు ముగిసిన అనంతరం సరైన తేమ శాతం వచ్చేవరకు ఆరబెట్టుకొని, కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని రైతులకు వివరించారు. రెండు మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నందున రైతులు పంటలను కోయరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులు ఉన్నారు.




