Wednesday, 4 November 2026

మసీదు, ఈద్గా ల అభివృద్ధికి ఫండ్ కేటాయిస్తాం – హుజూర్ నగర్ పెద్దమసీదులో ఇఫ్తార్ విందు

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 7 (జనం సాక్షి): మసీదు, ఈద్గా ల అభివృద్ధికి ఫండ్ ను కేటాయిస్తామని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ మార్కెట్ చెర్మెన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లోని పెద్ద మసీదులో పవిత్ర రంజాన్ ఉపవాసాల సందర్భంగా ఇస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ఏర్పాటుచేసిన దువా కార్యక్రమంలో, నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సైదిరెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా మహమ్మదీయ సహోదరీ సహోదరులు చేసేటటువంటి ఉపవాసం దీక్షలన్నీ ఆ అల్లా స్వీకరించి అందర్నీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండేలా దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అలాగే ఈ ప్రపంచం మొత్తానికి శాంతిని సౌభాగ్యాన్ని అల్లా దయవల్ల అన్ని కుటుంబాలకు చేరేలా దీవించాలని మనస్పూర్తిగా కోరుకున్నానన్నారు. నియోజక వర్గాన్ని అభివృద్ది పథంలో ముందు ఉంచుతామన్నారు. ఖబ్రస్తాన్ కొరకు 5 లక్షలు కేటాయించి అభివృద్ది చేస్తామన్నారు. ఈ ఇఫ్తార్ విందులో హుజూర్ నగర్ మార్కెట్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ నాయకులు సాధిక్, మైనారిటీ నాయకులు షఫీ, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ రెడ్డి, హరిబాబు, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఇమ్రాన్, జే ఎస్ డి , కార్మిక విభాగం నాయకులు పచ్చి పాల ఉపేందర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.