చల్లూర్ హై స్కూల్ విద్యార్థికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థి
వీణవంక మార్చి 18 (జనం సాక్షి )వీణవంక మండలంలోని చల్లూరు హైస్కూల్ విద్యార్థులకు ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని, డ్రాపౌట్ ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీంకి జడ్పీ హైస్కూల్ చల్లూర్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థి కిన్నెర శివాజీ ఎంపిక కవగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముల్కల. చంద్రకళ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మాట్లాడుతూ 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివి పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ ప్రతిభవంతులైన విద్యార్థులకు అందిస్తుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12,000, మొత్తంగా నాలుగు సంవత్సరాలకు రూ.48000 ల స్కాలర్షిప్ లభిస్తుందన్నారు.
చల్లూర్ హై స్కూల్ విద్యార్థికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థి




