తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి.అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మోపతయ్య.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి18 (జనంసాక్షి):
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా ప్రతి కార్యకర్త కంకనబద్ధులు కావాలని టిడిపి అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మోపతయ్య అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల మండలంలో శనివారం పిర్వటానిపల్లి,అయ్యవారిపల్లి గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులు నేటికీ గ్రామాలలో పల్లెల్లో కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలైన ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరుగుతుందోనని వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. టిడిపి క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అందులో భాగంగానే ఈరోజు 25 మంది తెలుగుదేశం పార్టీ ల సభ్యత్వం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల పార్టీ అధ్యక్షుడు కాశన్న ఎట్టయ్య,, నిరంజన్, వెంకటయ్య, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి.




