అగర్తాలా, జనంసాక్షి: చాక్లెట్లుపడనివారు ఉండరు! పిల్లలకైతే అవి మహా ఇష్టం! తన మూడేళ్ల కూతరు మారం చేస్తోందని త్రిపురంలో ఓ తండ్రి చాక్లెట్ కొన్నాడు. అది క్యాడ్‌బరీ చాక్లెట్! దాన్ని పాప తింటుండగా గుండుసూది బయటపడంది. దీంతో ఆ తండ్రి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. స్పందించిన ఫోరం క్యాడ్‌బరీ కంపెనీకి రూ.30వేల జరిమానా విధించింది. 2011 డిసెంబర్ 16న చాక్లెట్‌లో గుండుసూది బయటపడగా ఇటీవలే బాధితుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు విచారించిన ఫోరం ఇలాంటి ఉదంతాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఇది కంపెనీ నిర్లక్షానికి నిదర్శనమని పేర్కొంటూ జరిమానాను విధించింది.




