చాయ్ వాలా చేతులో బండి బొమ్మ…!
– బొమ్మ గీసి అభిమానం చాటుతున్న వైన0.
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 29
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్టీవో పాత చెక్పోస్ట్ వద్ద టీ స్టాల్ నడుపుకొనే కద0 శ్యాం తన కుంచెతో భాజపా రాష్ట్ర అధ్యక్షలు బొమ్మనుగీసి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్ రేపు జరగబోయే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా పార్టీలకతీతంగా ఈ చిత్రాన్ని తనకు ఇవ్వలని, తన అభిమానాన్ని చాటాలని నిర్ణయించుకొని ఈ చిత్ర0గీసినట్లు తెలిపారు. చిత్రకళ పై మక్కువున్న శ్యామ్ గత కొన్ని రోజులుగా బ్రతుకుతెరువుకు ఛాయ్ వాలా గా ఉంటూ,బండి చిత్రాన్ని గీసి మరోసారి చిత్ర కళాకారుడని నిరూపించుకుంటున్నా డు




