తప్పుడు ప్రచారాలు మానుకోండి.
సొంత లాభాల కోసం లేనిపోని ఆరోపణలు.
తాండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్.
తాండూరు నవంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీలో 200 మంది కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరినారని తప్పుడు ప్రచారం చేశారో పూర్తిగా అవాస్తవమని తాండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరణ్ కోట్ మాజీ సర్పంచ్ ప్రస్తుత ఎంపిటిసి2 శివకుమార్ తన సొంత ప్రయోజనాల కోసం దళిత బందుకు ఆశపడి తనను గ్రామంలో గతంలో ఎవరూ గుర్తించక పోయినప్పటికిని కాంగ్రెస్ పార్టీ తనకు ప్రజల్లో గుర్తించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఆయనతోపాటు 200 మంది కార్యకర్తలు వెళ్లారు అని తప్పుడు ప్రచారం చేయడం ఇది చాలా దారుణం అన్నారు. ఈ విషయాన్ని ఖండిస్తూ నిజంగా 200 మంది కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరారని నిరూపిస్తే నేను నా పదవికి మరియు కాంగ్రెస్ పార్టీని వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంతేకాకుండా నిరూపించక పోతే వచ్చే ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీని వీడిన 200 మంది ఎవరు అనేది తెలపాలని విజ్ఞప్తి చేశారు.
తప్పుడు ప్రచారాలు మానుకోండి.




