త్వరగా పనుల పూర్తి కావాలి : సి.ఎస్.జోషి ఆదేశం
హైదరాబాద్,మే5(జనం సాక్షి ): చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పనుల్లో స్థానికుల అభిప్రాయాలను పరిగణల్లోకి తీసుకోవడంతో పాటు వారికి భాగస్వామ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పేర్కొన్నారు. చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర ప్రభత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జీ కమిషనర్ భారతి ¬లికేరితో కలిసి పరిశీలించారు. మూసినది పై ప్రతిపాదిత హాకర్ జోన్ నిర్మాణ ప్రాంతాన్ని, పత్తర్ గట్టిలో ఆక్రమణల తొలగింపు, చార్ కమాన్ల పునరుద్ధరణ, చుడి బజార్, ముర్గీ చౌక్, మక్కా మస్జీద్, మోజంజాహి మార్కెట్ పురుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా సి.ఎస్.జోషి మాట్లాడుతూ హైదరాబాద్ నగర చిహ్నమైన చారిత్రక చార్మినార్‌ను ప్రతి రోజు వేలాదిమంది సందర్శిస్తారని, పర్యాటకులను మరింతగా ఆకర్షించడానికి చేపట్టిన చార్మినార్ ప్రాజెక్ట్ పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. పనుల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలను పాటించి మరింత ఆకర్షణీయంగా ఉండేవిధంగా చేపట్టాలని సూచించారు. చార్మినార్ నుండి మక్కా మస్జీద్ వీక్షించేందుకు అడ్డంగా ఉన్న కొన్ని కట్టడాలను వారి సలహాలు సూచనలను చేపట్టి మరోచోటకు తరలించాలని సూచించారు. సుప్రసిద్ద పర్యాటక, చారిత్రక స్థలమైన చార్మినార్‌తో పాటు పరిసర ప్రాంతాలను పర్యాటకులకు మరింత ఆకర్షనీయంగా ఉండేవిధంగా చార్మినార్ పెడెస్టేరియన్ పనులను చేపట్టాలని పేర్కొన్నారు. దాదాపు 35కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న చార్మినార్ పాదాచారుల ప్రాజెక్ట్ పనుల పురోగతిని సవిూక్షించారు. గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ పనులను యుద్ద ప్రాతిపదికపై పూర్తిచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించడంతో చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతిని జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇంజనీర్లతో కలిసి పరిశీలించిన చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి చార్మినార్ ప్రాజెక్ట్ వల్ల ఉపాధి అవకాశాలకు ఏవిధమైన భంగం కలగకుండా హాకర్లకు సాలర్‌జంగ్ మ్యూజియం వద్ద మూసిపై ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. చార్మినార్ బఫర్‌జోన్ చుట్టూ చేపట్టిన గ్రానైట్ పేమెంట్ పనులు, లాడ్ బజార్ నుండి సర్దార్ మహల్ వరకు పూర్తి అయిన గ్రానైట్ పేమెంట్ పనులను సీ.ఎస్ పరిశీలించారు. లాడ్ బజార్‌లో ఉన్న దుకాణాలన్నింటిని ఒకే మాదిరిగా ఉండే విధంగా రూపుదిద్దేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్ వివరించారు. లాడ్ బజార్ మార్గంలోని ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు భాగాన్ని స్థానిక సంస్కృతిని తెలియజేసేలా ఒకే మాదిరిగా ఎలివేషన్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు ఆయన సీ.ఎస్‌కి వివరించారు.ఇందుకుగాను 39కోట్ల రూపాయలు వ్యయంతో అంచనాలను రూపొందించామని వివరించారు. స్వచ్ఛ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద ఎన్.టి.పి.సి 9కోట్ల రూపాయలను స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టడానికి మంజూరు చేసిందని జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జీ కమిషనర్ భారతి ¬లికేరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, సౌత్ జోన్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్, చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ దత్తుపంత్ తదితరులు పాల్గొన్నారు.
చార్మినార్ పాదచార పనుల్లో స్థానికుల భాగస్వామ్యం




