దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 27 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని చింతకుంట్ల గ్రామంలో వంపు వెంకటయ్య కవిత దంపతులకు ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఐదుగురు కుటుంబ సభ్యులు పూరి గుడిసెలోనే జీవనం కొనసాగిస్తున్నామని ఎంతోమంది అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టిన ఎవరు కూడా స్పందించలేదని ఎన్ని ప్రభుత్వాలు మారినా మా జీవనం ఇలాగే ఉందని గత్యంతరం లేక పూరి గుడిసెలోనే జీవనం సాగిస్తున్నామని కొండమల్లేపల్లి మండలంలోని చాలా గ్రామాలలో ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి పేద ప్రజలకు చేయూతనిస్తూ ఆర్థికంగా ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్న మీకు మా బాధను సమస్యను స్వయంగా ఒకసారి మీకు చూపించాలని ఒక్కసారి దయచేసి మా ఇంటికి వచ్చి మా పేద బ్రతుకుల బాధలను చూడండి అని వంపు వెంకటయ్య కవిత దంపతులు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డికి ప్రాధేయపడ్డారు వంపు వెంకటయ్య కవిత కోరిక మేరకు వెంటనే ఒకసారి వెళ్లి వారి ఇంటి పరిసరాలను గమనించాలని చింతకుంట్ల గ్రామంలోని వంపు వెంకటయ్య కవిత దంపతుల ఇంటికి వెళ్లారు ఎంపీపీ దంపతులు ఒక్కసారిగా వంపు వెంకటయ్య దంపతుల ఇల్లు చూడగానే వెంటనే చెల్లించి పోయారు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజులలో కూడా ఇంత పేదరికం లో ఉండి సొంత ఇల్లు కూడా లేదని వారు నివసిస్తున్న పూరి గుడిసెను చూసి వారి హృదయం చలించిపోయింది వెంటనే వంపు వెంకటయ్య కవిత దంపతులకు సొంత ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వంతో సంబంధం లేకుండా మా వ్యక్తిగతంగా మానవతా దృక్పథంతో వారి సొంత ఇల్లు కలను నెరవేర్చారు వెంటనే కొబ్బరికాయ కొట్టి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు అనంతరం వంపు వెంకటయ్య కవిత దంపతులు వారి కుటుంబ సభ్యులు ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేశారు, చింతకుంట్ల గ్రామం తో పాటు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వివిధ మండలాల ప్రజలు పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో పేద ప్రజలకు చేయూతనిస్తున్న ఎంపీపీ దంపతుల నిర్ణయాలను స్వాగతిస్తున్నారు ఎలాంటి కల్మషం లేని, లాభాపేక్ష లేని కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలను అని చూడకుండా ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా వెంటనే ఒప్పుకొని వారి సమస్యలు తీర్చే నాయకుడని దేవరకొండ నియోజకవర్గం లోని ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు ఈ సందర్భంగా ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మనం స్వశక్తితో ఎదగాలని, టెక్నాలజీకి అనుగుణంగా అభివృద్ధి చెందాలని యువత చదువుల్లో రాణించాలని ఏ వ్యాపారం చేసినా రాజకీయం చేసిన తోటి వారికి నిరుపేదలకు అనాధలకు మన వంతు ఎంతో కొంత సహాయం చేసే విధంగా ఉండాలని ఈ రోజుల్లో కూడా మన దేశంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలు ఉండడం చాలా బాధాకరమని మన పిల్లలను బాగా చదివిస్తే వారు కుటుంబానికి సమాజానికి దేశానికి ఉపయోగపడే వారవుతారని వారు తెలిపారు మండలంలోని చాలా గ్రామాలలో ఇప్పటికే చాలా గ్రామాలలో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని




