Tuesday, 3 November 2026

ప్రభుత్వ పథకాలను ప్రచార రథం ద్వారా ఇంటింటి ప్రచారం చేస్త

 

 

 

 

*రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి తూప్రాన్ జనవరి 27( జనం సాక్షి) ::: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రభుత్వ పథకాల ఇంటింటికి గ్రామ గ్రామాన ప్రతి వీధిలో ప్రచారం నిర్వహించడానికి ప్రచార యాత్రలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ లో నరసింహారెడ్డి యువకుడు టిఆర్ఎస్ పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు తన ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒక ప్రచార రథం చొప్పున ఆరు ప్రచార రథాలను తయారు చేయించి ప్రతి ఇంటికి ప్రతి వీధికి ప్రచారం చేస్తానని ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి ఆరు ప్రచార రథాలను తయారు చేయించనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గజ్వేల్ నియోజకవర్గం నుండి ఆరు పాత మండలాలలో 6 ప్రచార రథాలు త్వరలో తయారు చేయించనున్నట్లు ఆయన వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం గురించి చేసిన ఉద్యమ వివరాలను ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలైన మిషన్ భగీరథ కొండపోచమ్మ అన్నవరం సుందిళ్ల రంగనాయక సాగర్ విడ్మనేరు కోటపల్లి కేశవపురం బసాపురం మొదలగు రిజర్వాయర్లు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రిగా దక్కుతుందని అన్నారు అలాగే మిషన్ భగీరథ తో పాటు మిషన్ కాకతీయ స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ సర్దార్ కార్యక్రమం పల్లె ప్రకృతి నర్సరీ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు బీమా రైతు బంధు వంటి పథకాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రచారం నిర్వహించడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి త్వరలో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ జెడ్పిటిసి ర్యాని సత్యనారాయణ గౌడ్ కౌన్సిలర్లు సత్యనారాయణ గుప్తా రవీందర్ పట్టణ పార్టీ అధ్యక్షులు సతీష్ గుర్రాన్ అహ్మద్ శీను కృష్ణ చంద్రం మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ ధర్మేందర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు