కొండమల్లేపల్లి ఏప్రిల్ 16 జనంసాక్షి న్యూస్ :కొండమల్లేపల్లి మండల పరిధిలోని చింతకుంట్ల గ్రామ పంచాయతీలో ఆదివారం రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దూదిపాల శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి,దూదిపాల శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు అనంతరం గ్రామస్తులు శివాజీ మహారాజ్ విగ్రహానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో యువకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున విగ్రహ దాతలకు సన్మానం చేశారు చింతకుంట్ల గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న దూదిపాల కుటుంబ వారసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంది రుద్రమ్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ యేకుల సురేష్, వార్డ్ మెంబెర్స్ శవ్వ ఆంజనేయులు,రాజు,అంజి యాదవ్,బాలకృష్ణ,మహేష్,ఆంజనేయులు,నగేష్,ఏడుకొండలు,సైదులు, అనిల్, ముత్యాలు, శ్రీనివాస్, శివ,ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.




