Thursday, 5 November 2026

దేశసౌభాగ్యంలో ఆర్ ఎస్ ఎస్ పాత్రకీలకం

 

 

 

 

 

 

నిర్మల్ బ్యూరో, ఏప్రిల్16,జనంసాక్షి,, సంఘ ఆలోచనలు,  హైందవ ధర్మం, ప్రజలందరికి క్షేమాన్ని ఆకాక్షిస్తుందని. ప్రముఖ సంఘ సేవకురాలు కొంపల్లి మాధవిలత  అన్నారు, ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో కుటుంబ సహల్  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, అప్పాల ప్రసాద్,మాధవి లతలు హాజరై ప్రసంగించారు. మన దేశంలో భార్య భర్తల బంధం పవిత్రమైనది .పాశ్చాత్య దేశాల్లో కుటుంబ వ్యవస్థ లేదు.ప్రపంచ దేశాలు మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను  గౌరవిస్తారని అన్నారు.పిల్లలకు కుటుంబ వ్యవస్థ గురించి తెలియజేయాలని,అమ్మమ్మ,నానమ్మ,బందువులతో ప్రేమానురాగాలు పెంపొందించాలని,ఉన్నత చదువుల తో పాటు మంచి క్రమశిక్షణ నేర్పాలన్నారు.పాశ్చాత్య సంస్కృతి ని విడనాడి ఆధ్యాత్మికతవైపు  యువత పయనించాలని  అన్నారు, మహిళలు వంటింటికీ పరిమితం కాకుండా విద్య, వైద్య, సామాజిక తోపాటు అన్ని రంగాల్లో రాణించాలని,పిలుపునిచ్చారు, అనంతరం కుటుంబ సభ్యులతో క్విజ్,ఆటా పాటలలో పోటీలు నిర్వహించారు, చిన్నారుల నృత్యాలు చూపరులను ఎంతో ఆనందింపజేశాయి.ఈకార్యక్రమంలో అర్ ఎస్ ఎస్ జిల్లా కార్యవాహ నుకల విజయ్ కుమార్, దిగంబర్, డా,,ప్రమోద్ చందర్ రెడ్డి, మంచిర్యాల నాగభూషణం, అయ్యన్నగారి భూమయ్య, శ్రీధర్, అల్లాడి సూర్యనారాయణ, సోలాపూర్ రాజేశ్వర్,తదితరులు పాల్గొన్నారు