చింతకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కొండమల్లేపల్లి నవంబర్ 7 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల పరిధి చింతకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోగల 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చాలా ప్రమాదకరంగా మారిందని మనుషులకు మూగ జీవులకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందని ప్రజలు భయపడుతున్నారు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు నిత్యం ప్రజలు వెళ్లే దారిలో ఇలాంటి ప్రమాదకరమైన ట్రాన్స్ ఫార్మర్ వెంటనే మార్చాలని ప్రజలు వేడుకుంటున్నారు గతంలో కూడా ఈ ట్రాన్స్ ఫార్మర్ ద్వారా ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడని మూగ పాడి పశువులు కూడా మృత్యువాత పడ్డాయని తెలిపారు మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు
చింతకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కొండమల్లేపల్లి నవంబర్ 7




