ప్రభుత్వ వసతిగృహాలకు స్వంత భవనాలు నిర్మించాలి.
జ్యోతిబాపూలే,సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలి.
పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కి వినతిపత్రం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 7(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని ప్రభుత్వ వసతిగృహాలకు స్వంత భవనాలు నిర్మించాలని పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి ఆధ్వర్యంలో వసతిగృహాల విద్యార్థులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అరవింద్ చారి ఎమ్మెల్యే తో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజక వర్గం లోని బీసీ సంక్షేమ హాస్టళ్లకు ఖాళీ స్థలాన్ని ఇచ్చి విద్యార్థులకు సౌకర్య వంత మైన వసతులతో భవనాలు నిర్మించి ఇవ్వాలని కోరారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కాబట్టి మిగతా తాలూకా ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యార్థులు వచ్చి చదువుకునే అవకాశం ఉంటుందని దీనివల్ల నాగర్ ర్నూల్ నియోజకవర్గానికి మంచి పేరు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టణంలో జ్యోతి రావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు స్థలాలు కేటాయించి విగ్రహాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ నియోజకవర్గానికి సంక్షేమ హాస్టల్ ల స్థలాలు,సొంత భవనాలు నిర్మించే విధంగా అలాగే జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి పూలే విగ్రహాల స్థలాలు, విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా నని హామీ ఇచ్చారని అరవింద్ చారి తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు బిసి పొలిటికల్ జేఏసీ తరపన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో హాస్టల్ విద్యార్థులు కుమార్, లక్ష్మణ్.మోహన్, మధు,భరత్,దిలీప్, శ్రీకాంత్, వెంకటేష్,ఉదయ్ కుమార్, వంశీ, పాండు, గణేష్, ఆనంద్,ఉదయ్ కిరణ్, హరీష్,చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.




