కుంచం నరసింహ మృతి బాధాకరం దూదిపాల శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 22 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం చింతకుంట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచం నరసింహ మృతి చెందిన విషయం తెలుసుకున్న దూదిపాల శ్రీధర్ రెడ్డి చింతకుంట్ల గ్రామానికి వెళ్లి వారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుంచం నరసింహ మృతి బాధాకరమని ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో చింతకుంట్ల ఉప సర్పంచ్ యేకుల సురేష్, కార్తీక్, ఎండి ఖదీర్, సేవ నాయక్, అంజి తదితరులు పాల్గొన్నారు.
చింతకుంట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు




