జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 22.(జనంసాక్షి). సమాజ హితం కోరే సాహిత్యం ఎక్కువగా రావాల్సి ఉందని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అన్నారు. ఆదివారం గోసికొండ మురారి పంతులు రచించిన “అనుభవామృత సారం”పుస్తక ఆవిష్కరణ జిల్లా గ్రంథాలయంలో సిరిసిల్ల సాహితి సమితి, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునురి శంకరయ్య మాట్లాడుతూ సమాజ హితం కోరే సాహిత్యం రావాల్సి ఉందని అన్నారు. తన అనుభవాలను ఇప్పటి తరానికి అందించేలా పుస్తకాన్ని ప్రచురించిన గోషికొండ మురారి పంతులను అభినందించారు. కార్యక్రమంలో సీసాస అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, వెంగళ లక్ష్మణ్, వాసర వేణి పరుశురాములు,నంది శ్రీనివాస్, పద్మపీఠం ఎడిటర్ భాస్కర్, బూర భుమనందం, డాక్టర్ నిరోషా, జీవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
సమాజ హితం కోరే సాహిత్యం రావాలి.సమాజ హితం కోరే సాహిత్యం రావాలి.




