ఆర్డిఓ బి చెన్నయ్య.మిర్యాలగూడ జనం సాక్షి. ఈనెల 18వ తేదీన నిర్వహించే శివరాత్రి పర్వదిన పండుగ వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని మిర్యాలగూడ ఆర్డీవో బి చెన్నయ్య ఆదేశించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ పోలీస్, ఇతర అధికారులతో మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు సంబంధించి ఆర్డిఓ బి చెన్నయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన డివిజన్ పరిధిలో గల శైవ క్షేత్రాల ప్రాంతాలలో, ఇతర ప్రాంతాలలో గల శివాలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. నది తీర ప్రాంతాల్లో గల సేవ క్షేత్రాలకు భక్తులు వెళ్లేందుకుగాను ఆర్టీసీ అధికారులు 18వ తేదీ వేకువ జాము నుండి ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు. ఎంపీడీవోలు, తాసిల్దారులు, అగ్ని మాపాక దళ అధికారులు, ఆర్ డబ్ల్యూ ఎస్, సిమెంట్ కర్మాగారాల అధికారులు, ఆలయాల ప్రధాన అర్చకులు, సంబంధిత శాఖల పాల్గొన్నారు.




